Mon Dec 23 2024 14:54:10 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిపై పోలీస్ కేసు..!
చిరంజీవిపై మన్సూర్ అలీఖాన్ పోలీస్ కేసు నమోదు చేయడానికి సిద్దమవుతున్నారట. రేపు కోర్టులో చిరంజీవి పై క్రిమినల్..
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ పోలీస్ కేసు నమోదు చేయడానికి సిద్దమవుతున్నారట. తమిళ మీడియా వర్గాలు ఈ వార్తలను రాసుకొస్తున్నాయి. రేపు కోర్టులో చిరంజీవి పై క్రిమినల్ మరియు పరువు నష్టం దావా కేసు నమోదు చేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చినీయాంశంగా మారింది. అసలు ఏమైంది..? చిరంజీవి పై కేసు నమోదు చేయడం ఎందుకు..?
మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లియో సినిమాలో త్రిషని రేప్ చేసే సీన్ తనకి రానందుకు చాలా ఫీల్ అయ్యాను అంటూ చేసిన వ్యాఖ్యలో వివాదానికి దారి తీశాయి. ఇక ఈ వ్యాఖ్యలను త్రిష తీవ్రంగా ఖండించగా ఆమెకు సపోర్ట్ గా మాళవిక మోహనన్, చిన్మయి, కుష్బూ, లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, నితిన్, చిరంజీవి.. ఇలా పలువురు సినీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తూ మన్సూర్ పై అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో దక్షిణ భారత నటీనటుల సంఘం మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్రిషకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపించింది. కానీ ఆయన మాత్రం క్షమాపణలు చెప్పేదేలేదు అని బదులిచ్చారు. దీంతో జాతీయ మహిళా కమిషన్ మన్సూర్ పై కేసు నమోదు చేసి కోర్టు వరకు తీసుకు వెళ్లారు. ఇక ఈ కేసుతో మన్సూర్ ఒక మెట్టు దిగివచ్చి ఈ శుక్రవారం నవంబర్ 24న త్రిషకు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
తన క్షమాపణలతో ఈ వివాదానికి ముగింపు ఇస్తున్నట్లు మన్సూర్ పేర్కొన్నారు. కానీ మన్సూర్ మళ్ళీ ఆ వివాదాన్ని తెర పైకి తీసుకు వస్తున్నారట. నిజం ఏంటనేది తెలుసుకోకుండా త్రిష, కుష్బూ, చిరంజీవి తన పరువుకి భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని, అందుకనే ఈ ముగ్గురు పై క్రిమినల్ మరియు పరువు నష్టం దావా కేసు నమోదు చేయాలని మన్సూర్ నిర్ణయం తీసుకున్నారట. రేపు వీరి పై కేసు నమోదు చేయనున్నారట.
అసలు మన్సూర్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. "కెరీర్ లో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ లో నటించానని, ఆ సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాడిని, అయితే 'లియో' సినిమాలో త్రిషతో అలాంటి సీన్ లేనందుకు చాలా ఫీల్ అయ్యాను" అంటూ మాట్లాడారు. ఈ మాటలకు సరైన వివరణ ఇదే అంటూ ఇటీవల ఒక ప్రెస్ మీట్లో మన్సూర్ ఇలా చెప్పుకొచ్చారు.. తనవద్దకు రేప్ సీన్స్ తో ఉండే పాత్రలే ఎక్కువ వస్తుండడంతో లియోలో కూడా అదే తరహా పాత్రని అనుకున్నారట. కానీ సినిమాలో అసలు తనకి త్రిష మధ్య సన్నివేశం లేకపోవడంతో బాధపడ్డానంటూ చెప్పుకొచ్చారు.
Next Story