Mon Dec 23 2024 08:15:32 GMT+0000 (Coordinated Universal Time)
Trisha vs Mansoor : క్షమాపణలు చెప్పేదేలే.. త్రిషపై పరువు నష్టం కేసు వేస్తా..
మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదంటున్నారు. తానే త్రిష పై పరువు నష్టం కేసు వేస్తానంటూ..
Trisha vs Mansoor : స్టార్ హీరోయిన్ త్రిష, తమిళ్ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదం రోజురోజుకి పెద్దది అవుతూ వెళ్తుంది. సినిమాలో త్రిషని రేప్ చేసే సీన్ తనకి రానందుకు చాలా ఫీల్ అయ్యాను అంటూ మన్సూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీశాయి. ఈ విషయం పై త్రిష ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆమెకు సపోర్ట్ గా మాళవిక మోహనన్, చిన్మయి, లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, నితిన్, చిరంజీవి.. ఇలా పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ విషయం పై మన్సూర్ అలీఖాన్ స్పందిస్తూ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా వేశారు. తాను మాట్లాడిన వీడియో మొత్తం చూడకుండా ఒక చిన్న క్లిప్ ని ఎడిట్ చేసి వైరల్ చేస్తూ తన పై నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని, తాను పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు, దానిని డామేజ్ చేసేందుకు ఇలా తన మీద కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే, జాతీయ మహిళా కమిషన్.. చెన్నైలోని నంగంబాక్కం పోలీసు స్టేషన్ లో మన్సూర్ పై కేసు నమోదు చేశారు. అలాగే నడిగర్ సంఘం నుంచి కూడా త్రిషకి క్షమాపణలు చెప్పాలని మన్సూర్ కి నోటీసులు వెళ్లాయి.
తాజాగా ఈ నోటీసులు, కేసులు గొడవ పై మన్సూర్ స్పందిస్తూ మీడియా ముందు మాట్లాడారు. తాను అన్న మాటల్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని, తానేమి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, విషయమేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇప్పటికే చాలా మంది సినిమా వ్యక్తులు తనపై కామెంట్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తన మీద కామెంట్స్ చేసేవాళ్ళు అంతా మంచివారినే..? అని తిరిగి క్యూస్షన్ చేశారు. నడిగర్ సంఘం కూడా తన వివరణ ఏంటో వినకుండా, అసలు జరిగిన విషయం చెప్పే ఛాన్స్ కూడా తనకి ఇవ్వకుండా ప్రవర్తిస్తుందని చెప్పుకొచ్చారు. త్రిషకి తాను క్షమాపణలు చెప్పేదే లేదని, తానే త్రిష పై పరువు నష్టం కేసు వేస్తానంటూ పేర్కొన్నారు.
ఇక మన్సూర్ చేసిన ఈ కామెంట్స్ తమిళనాట మరింత వివాదానికి దారి తీస్తుంది. కాగా మన్సూర్ చేసిన కామెంట్స్ ఏంటంటే.. "కెరీర్ లో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ లో నటించానని, ఆ సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాడిని, అయితే 'లియో' సినిమాలో త్రిషతో అలాంటి సీన్ లేనందుకు చాలా ఫీల్ అయ్యాను" అంటూ మన్సూర్ మాట్లాడారు.
Next Story