Mon Dec 23 2024 14:59:09 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : హీరోయిన్స్‌తో చిరు జల్సా.. మన్సూర్ సంచలన కామెంట్స్..
చిరంజీవి ప్రతి సంవత్సరం హీరోయిన్స్ తో కలిసి పార్టీలు చేసుకుంటుంటారు అంటూ మన్సూర్ అలీఖాన్ సంచలన కామెంట్స్ చేశారు.
త్రిష-మన్సూర్ వివాదం కాస్త చిరంజీవి- మన్సూర్ వివాదంగా మారుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ.. హీరోయిన్ త్రిషని 'లియో' సినిమాలో రేప్ చేసే సీన్ తనకి రానందుకు చాలా ఫీల్ అయ్యాను అని మాట్లాడడం తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం పై రియాక్ట్ అవుతూ, త్రిషకి సపోర్ట్ గా మాళవిక మోహనన్, చిన్మయి, కుష్బూ, లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, నితిన్, చిరంజీవి.. మన్సూర్ పై అసహనం వ్యక్తం చేశారు.
దీంతో జాతీయ మహిళా కమిషన్ మన్సూర్ పై కేసు నమోదు చేయడం, దక్షిణ భారత నటీనటుల సంఘం మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్రిషకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపడం జరిగింది. మొదటిలో మన్సూర్ సారీ చెప్పానంటూ బదులిచ్చినప్పటికీ.. విషయం కోర్టు వరకు వెళ్లడంతో క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఇక ఈ వివాదానికి ఎండ్ కార్డు వేస్తున్నానంటూ త్రిషకు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
అయితే నిజం ఏంటనేది తెలుసుకోకుండా త్రిష, కుష్బూ, చిరంజీవి తన పరువుకి భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని మన్సూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆ ముగ్గురి పై క్రిమినల్ మరియు పరువు నష్టం దావా కేసు నమోదు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. తాజాగా చిరంజీవి ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
మన్సూర్ అలీఖాన్ కామెంట్స్..
"ప్రతి సంవత్సరం చిరంజీవి తనతో కలిసి నటించిన హీరోయిన్స్ తో కలిసి పార్టీలు చేసుకుంటుంటారు. నేను ఆయనతో కలిసి నటించాను. కాని నన్ను ఎప్పుడూ ఆ పార్టీలకు పిలువలేదు. కేవలం హీరోయిన్స్‌ని మాత్రమే ఆయన పిలుస్తారు. అయితే అది ఆయన ఇష్టం అనుకోండి. కానీ నా విషయంలో ఆయన ఒకసారి ఫోన్ చేసి అసలు విషయం ఏంటని తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది" అంటూ మన్సూర్ వ్యాఖ్యానించారు.
అలాగే చిరంజీవి పొలిటికల్స్ గురించి మాట్లాడుతూ.. "ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన బ్రదర్ పవన్ కళ్యాణ్ కూడా ఒక పార్టీ నడుపుతున్నారు. అయితే వారు తమ కోసమే సంపాదించుకున్నారు. ఎప్పుడూ పేదవారికి హెల్ప్ చేయలేదు. నా పరువుకి భంగం కలిగించేలా కామెంట్స్ చేసినందుకు నేను త్రిష, కుష్బూ, చిరంజీవి పై 20 కోట్ల పరువు నష్టం దావా కేసు వేశాను. ఆ వచ్చిన డబ్బుని మధ్యంతో నష్టబోయిన కుటుంబాలకు అందజేస్తాను అని ప్రమాణం చేస్తున్నాను" చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Next Story