Mon Dec 23 2024 14:13:59 GMT+0000 (Coordinated Universal Time)
రమేష్ బాబు మృతి పట్ల ప్రముఖుల సంతాపం
సూపర్ స్టార్ కృష్ణ పెద్దకుమారుడు రమేష్ బాబు మృతి పట్ల పలువరు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ పెద్దకుమారుడు రమేష్ బాబు మృతి పట్ల పలువరు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రమేష్ బాబు మృతికి సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే రమేష్ బాబు మరణించడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.
కుటుంబానికి....
అలాగే మెగాస్టార్ చిరంజీవి రమేష్ బాబు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తెలియగానే తాను షాక్ కు గురయ్యానని చిరంజీవి చెప్పారు. ఈ పరిస్థితి నుంచి కృష్ణ కుటుంబ సభ్యులు కోలుకోవాలని చిరంజీవి ప్రార్థించారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు రమేష్ బాబు మృతికి సంతాపాన్ని ప్రకటించారు. ప్రస్తుతం రమేష్ బాబు భౌతిక కాయాన్ని పద్మాలయా స్టూడియోలో ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story