Mon Dec 23 2024 07:07:20 GMT+0000 (Coordinated Universal Time)
మట్కా, కంగువా మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా?
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మట్కా' నవంబర్ 14న విడుదలైంది. తొలి షో నుంచే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.75 లక్షల వసూళ్లను మాత్రమే సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'గద్దలకొండ గణేష్' తరువాత 'మట్కా' తో వరుణ్ తేజ్ హిట్ కొడతాడని ఆశించారు. అయితే అనుకున్న ఫలితం రాబట్టలేకపోయింది ఈ సినిమా. ఘని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ లాగే ఈ సినిమా కూడా నిలవనుందని అంటున్నారు. చూద్దాం వీకెండ్ లో ఈ సినిమా ఏమైనా వండర్స్ చేస్తుందేమో!
సూర్య నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా కంగువ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. సక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం, నవంబర్ 14న ఇండియా బాక్సాఫీస్ వద్ద కంగువ దాదాపు రూ. 22 కోట్ల నికర వసూళ్లు సాధించింది. తమిళ వెర్షన్ కు నవంబర్ 14న 37.25 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్వాలేదనే కలెక్షన్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన కంగువ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం.
Next Story