Mon Dec 23 2024 12:44:06 GMT+0000 (Coordinated Universal Time)
మే డే స్పెషల్.. భోళాశంకర్ నుండి కొత్త పోస్టర్లు విడుదల
తమిళంలో అజిత్ నటించిన వేదాళంకు తెలుగులో రీమేక్ అవుతోన్న సినిమా ఇది. కోల్ కతా నేపథ్యంలో జరిగే ఈ కథలో..
చిరంజీవి హీరోగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా భోళా శంకర్. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో కనిపించనుంది. తమిళంలో అజిత్ నటించిన వేదాళంకు తెలుగులో రీమేక్ అవుతోన్న సినిమా ఇది. కోల్ కతా నేపథ్యంలో జరిగే ఈ కథలో.. చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. నేడు 'మేడే' అనగా కార్మికుల దినోత్సవం సందర్భంగా భోళా శంకర్ నుండి మేకర్స్ కొన్ని పోస్టర్లను విడుదల చేశారు.
ఈ పోస్టర్లలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ కథలో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ఎక్కువగా ఉండనుందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Next Story