మేనేజర్ తో అడిగించే హీరో ఓ వైపు.. రెండు లక్షలు ఇస్తానని ఒకడు..!
ఇండస్ట్రీలో తనకెదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. కమిట్మెంట్ ఇస్తే, ఒక వ్యక్తి తనకు
నటి ప్రాచీ ఠాకర్ ఇండస్ట్రీలో తనకెదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. కమిట్మెంట్ ఇస్తే, ఒక వ్యక్తి తనకు రూ.2 లక్షలిస్తానని చెప్పాడని, తాను ఒప్పుకోలేదని తెలిపింది. దీంతో తాను ఒక ఆఫర్ కోల్పోయానని చెప్పుకొచ్చింది. పటాస్ సినిమా చేసిన తర్వాత ఒక యాడ్ ఏజెన్సీ వాళ్లు నన్ను సంప్రదించారు. ఒక యాడ్ చేయమని వాళ్లు అడిగితే, అందుకు సరేనన్నాను. అయితే.. నాకు తెలుగు భాష సరిగ్గా రాదు కాబట్టి, మీడియేటర్‌గా తెలుగు స్నేహితుడిని నియమించుకున్నాను. ఆ ఏజెన్సీ వాళ్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నాతో ఈ యాడ్ డీల్ మాట్లాడిన వ్యక్తి, నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. షూటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్తానని అన్నాడు. అతడేమో.. మీరు కమిట్మెంట్ ఇస్తున్నారు కదా అని అడిగితే.. నాకు అర్థం కాలేదు. బహుశా యాడ్ షూట్ గురించి అంటున్నాడేమోనని అనుకొని, ఎప్పుడు షూట్ ఉంటే ఆరోజే కమిట్మెంట్ ఇస్తానని చెప్పాను. అయితే రెండో సారి అతడు కమిట్మెంట్కు నువ్వు రెడీనే కదా? అని అన్నాడు. నేనేమో నువ్వు డేట్ చెప్పు.. కచ్చితంగా ఆరోజు షూట్‌కి వచ్చేస్తానని సమాధానం ఇచ్చాను. అప్పుడతను.. మేటర్ అది కాదు, నాకో పార్ట్నర్ ఉన్నాడు, అతనితో కాంప్రమైజ్ అయితే నీకు రెండు లక్షలిస్తా అని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. ఆ చాట్ ను స్క్రీన్‌షాట్ తీసి నా ఫ్రెండ్‌కు పంపిస్తే.. అసలు విషయం చెప్పింది. దాంతో మరో దారి లేక ఆ యాడ్ చేయనని తెగేసి చెప్పానని ప్రాచీ ఠాకర్ చెప్పుకొచ్చింది. ప్రాచీ రాజుగారి కోడి పులావ్ సినిమాలో హీరోయిన్గా నటించింది.