Tue Dec 24 2024 17:32:38 GMT+0000 (Coordinated Universal Time)
అంజనాదేవి పుట్టినరోజు.. నెట్టింట మెగా ఫోటోలు వైరల్
ఈ సందర్భంగా ఆ ఫోటోలను చిరంజీవి, నాగబాబు నెటిజన్లతో పంచుకుంటూ ట్వీట్ చేశారు. "మాకు జన్మని,
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ల మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు అన్నదమ్ములు, వారి సోదరీమణులు, వాళ్ల పిల్లలంతా ఒకచోట కలిసి సెలబ్రేషన్స్ చేశారు. ఈ సందర్భంగాఆ ఫోటోలను చిరంజీవి, నాగబాబు నెటిజన్లతో పంచుకుంటూ ట్వీట్ చేశారు. "మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు అమ్మ" అని చిరంజీవి ట్వీట్ చేశారు.
అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో ఫోటో షేర్ చేశారు. "మా జీవన రేఖ, జీవితం అనే కానుకతో తమను దీవించిన తల్లి జన్మదినాన్ని జరుపుకుంటున్నామని నాగబాబు వెల్లడించారు. నువ్వు మాపై కురిపించిన ప్రేమ, ఆదరణ పట్ల జీవితాంతం రుణపడి ఉంటాం అమ్మా" అంటూ భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. నాగబాబు, చిరంజీవిలు షేర్ చేసిన ఫొటోల్లో తల్లి అంజనాదేవి తో నాగబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, విజయ, మాధవి ఉన్నారు.
Next Story