Mon Dec 23 2024 10:12:29 GMT+0000 (Coordinated Universal Time)
మెగా భోగి సంబరాలు.. వరుణ్ తో "చిరు" అల్లరి
ఉదయాన్నే భోగిమంటలు వేసి, అనంతరం ఇంట్లోవారికి ఎంచక్కా దోశలు వేసి పెట్టారు. వంట చేసేటప్పుడు వరుణ్ తో
సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తొలిరోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వేకువజామునే లేచి.. భోగి మంటలకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని, దీపారాధన చేసి.. పండుగను ప్రారంభించారు. ప్రతి వీధిలోనూ భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా ఫ్యామిలీ కూడా భోగి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. మెగా కుర్రాళ్లతో కలిసి చిరంజీవి చేసిన అల్లరి పండక్కే హైలెట్ అయింది. ఇలా మెగా ఫ్యామిలీ అంతా ఓ చోట చేరి.. చేసుకున్న భోగి వేడుకలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఉదయాన్నే భోగిమంటలు వేసి, అనంతరం ఇంట్లోవారికి ఎంచక్కా దోశలు వేసి పెట్టారు. వంట చేసేటప్పుడు వరుణ్ తో కలిసి చిరు చేసిన అల్లరి పని నవ్వులు తెప్పిస్తుంది. చెరొక స్టవ్ వెలిగించి, దోసెల పెనాలు పెట్టి.. ఇద్దరూ దోసెలు వేశారు. వాటిలో చిరంజీవి దోసె సరిగ్గా రాలేదు. వరుణ్ దోసె బాగా రావడంతో.. దానిని కాస్తా చెడగొట్టేశారు చిరంజీవి. నాకు కుళ్లు వచ్చేసింది.. చెడగొట్టేయాలి అంటూ దోశను చిందరవందర చేసి ఉప్మా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీంతో వరుణ్ షాక్ అవ్వుతూ నవ్వడం మొదలుపెట్టాడు. ఈ వీడియోలో చిరు తల్లి అంజనా దేవి, నాగబాబు దంపతులు, మెగా ప్రిన్సెస్ నిహారిక, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కనిపించారు. ఈ వీడియోను ఇన్ స్టా చేసిన వరుణ్.. అభిమానులందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పాడు.
Next Story