మెగా ఫాన్స్ కి అడ్డంగా దొరికిన ప్రముఖ కాలమిస్ట్?
నిన్న తమిళ హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా హాఠాన్మరణం అందరిని కలిచి వేసింది. చిరంజీవి సర్జా మరణానికి టాలీవుడ్ నుండి కోలీవుడ్ ప్రముఖుల వరకు సోషల్ [more]
నిన్న తమిళ హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా హాఠాన్మరణం అందరిని కలిచి వేసింది. చిరంజీవి సర్జా మరణానికి టాలీవుడ్ నుండి కోలీవుడ్ ప్రముఖుల వరకు సోషల్ [more]
నిన్న తమిళ హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా హాఠాన్మరణం అందరిని కలిచి వేసింది. చిరంజీవి సర్జా మరణానికి టాలీవుడ్ నుండి కోలీవుడ్ ప్రముఖుల వరకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేసారు. అయితే ఓ ప్రముఖ కాలమిస్ట్, నావలిస్ట్. సామాజిక అంశాలపై అనర్గళంగా మాట్లాడే శోభా డే కూడా ఈ చిరంజీవి సర్జా మృతికి సంతాపం తెలియజేసింది. అయితే శోభా డే సంతాపం తెలియజేస్తే.. ఆమెపై మెగా ఫాన్స్ విరుచుకుపడుతున్నారు. కారణం శోభా డే చిరంజీవి సర్జా కి సంతాపం తెలుపుతూ… మెగాస్టార్ చిరంజీవి ఫోటో ని పోస్ట్ చేసింది.
భారతీయ సినిమా పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది అంటూ శోభా డే చిరు ఫోటోని పెట్టేసి తన సంతాపాన్ని తెలియజేయడంతో.. ఒక్కసారిగా సోషల్ మీడియా షేకయ్యింది. అందుకే శోభా డే ఇప్పుడు మెగా ఫాన్స్ ఆగ్రహానికి గురవడం జరిగింది. ఈమధ్యన బొలీవుడ్ నటులను, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా చాలామందిని కోల్పోవడం.. ఆ వెనువెంటనే చిరంజీవి సర్జా హఠాన్మరణంతో.. శోభా డే ఆ చనిపోయింది మెగాస్టార్ చిరు నే అనుకుని.., కనీసం చెక్ చేసుకోకుండానే చిరు ఫోటో ని పెట్టడంతో మెగా ఫాన్స్ కి ఒళ్ళు మండింది. దానితో శోభా డే పై మెగా ఫాన్స్ నిప్పులు కక్కుతున్నారు. చిరు బంగారంలాగ సినిమాలు చేయూసుకుంటూ ప్రభుత్వతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ బిజీగా గడుపుతుంటే ఆయన్నే చంపేస్తావా అంటూ ఆమెపై సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు.