డూప్ లేకుండా రిస్క్ చేస్తున్న మెగాహీరో
'తొలిప్రేమ' లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్... 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా నటిస్తున్నాడు. వరుణ్ కి జోడిగా లావణ్య త్రిపాఠి, అదితీరావు హైదరీలు నటిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో...
ఇది అంతరిక్ష పరిశోధనకి సంబంధించిన సినిమా కాబట్టి.. భారీ బడ్జెట్ తో ప్రత్యేకమైన సెట్ వేసి షూటింగ్ చేయనున్నారు. అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు వరుణ్. అయితే రియాలిటీ కోసం వరుణ్ డూప్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నారట. ఇలా వరుణ్ తానే స్వయంగా డూప్ లేకుండా చేస్తున్నాడు కాబట్టి.. అందుకు తగ్గ మరిన్ని జాగ్రత్తలు చిత్ర యూనిట్ తీసుకుంటుందని టాక్. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసి కొన్ని సీన్స్ కూడా చేశారు. అయితే ఆ సీన్స్ చిత్రానికే హైలైట్ అని అంటున్నారు. గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు.