Mon Dec 23 2024 02:27:03 GMT+0000 (Coordinated Universal Time)
మెగా పెళ్లి సందడి చూద్దాం రారండి..
మనవరాలు క్లీంకారతో చిరంజీవి దంపతులు ఆడుకుంటున్న ఫోటో, మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దంపతులు కలిసి ఒక ఫోటో, కొత్త జంటతో కలిసి మెగా హీరోలు అంతా ఫోటో, ఇలా..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డింపుల్ క్వీన్ లావణ్య త్రిపాఠి.. ఐదేళ్ల పాటు రహస్య ప్రేమాయణం నడిపి ఈ ఏడాది జులైలో ఎంగేజ్మెంట్ తో అందరికి తెలియజేశారు. నిశ్చితార్థం వేడుకతో మొదలైన ఈ పెళ్లి వేడుక.. పెళ్లి షాపింగ్, ప్రీ వెడ్డింగ్ పార్టీస్, సంగీత్ పార్టీ, హల్దీ, మెహందీ కార్యక్రమాల అంటూ సందడి సందడిగా సాగింది. ఇక ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మెగా అండ్ అల్లు ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి, ఉపాసన ఫ్యామిలీ, బంధుమిత్రులు కలిసి సందడి చేశారు.
ఈ వివాహానికి ఇటలీలోని టస్కనీ నగరం వేదిక అయిన సంగతి తెలిసిందే. ఎక్కడో విదేశాల్లో పెళ్లి చేసుకున్నా.. పూర్తి భారతీయ సంప్రదాయాలతో వివాహం ఘనంగా జరిగింది. నిన్న (నవంబర్ 1) రాత్రి గం.7:18 నిమిషాలకు వరుణ్, లావణ్య మేడలో వేద మంత్రాల సాక్షిగా మూడుముళ్లు వేశాడు. అనంతరం రాత్రి అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఇక ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.
మనవరాలు క్లీంకారతో చిరంజీవి దంపతులు ఆడుకుంటున్న ఫోటో, మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దంపతులు కలిసి ఒక ఫోటో, కొత్త జంటతో కలిసి మెగా హీరోలు అంతా ఫోటో.. ఇలా పెళ్లిలోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్ మెగా జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి మెగా పెళ్లి సందడి ఫోటోలను మీరుకూడా ఒకసారి చూసేయండి.
Next Story