Sun Dec 22 2024 20:19:03 GMT+0000 (Coordinated Universal Time)
వాల్తేరు వీరయ్య నుండి.. మాస్ పూనకాలు లోడింగ్
ఈ సినిమా నుండి రేపు చిరంజీవి - రవితేజలతో కలిపి తీసిన మాస్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ..
మెగాస్టార్ చిరంజీవి-శృతిహాసన్ జోడీగా.. మాస్ మహారాజా రవితేజ ముఖ్యపాత్రలో దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా నుండి రేపు చిరంజీవి - రవితేజలతో కలిపి తీసిన మాస్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. మెగాస్టార్ × మాస్ మహారాజా = పూనకాలు లోడింగ్ అంటూ పోస్టర్ విడుదల చేసి.. పాటపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ విడుదలై అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి.
వాల్తేరు వీరయ్యకు దేవిశ్రీ సంగీత బాణీలను సమకూర్చగా.. అభిమానుల నుండి మెగా స్పందన వస్తోంది. విడుదలవుతున్న ఒక్కోపాట.. మెగాఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. రేపు విడుదల కాబోయే మాస్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందోనని ఇప్పటి నుండే ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. శృతి హాసనన్ కాకుండా.. నటి కేథరిన్ ట్రెసా కీలకపాత్రలో కనిపించనుంది.
Next Story