Mon Dec 23 2024 06:52:30 GMT+0000 (Coordinated Universal Time)
కేజీఎఫ్ చాప్టర్ 2 తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేయనున్న చరణ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF Chapter 2 సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు సాయంత్రం
బెంగళూరు : కేజీఎఫ్ సినిమా తర్వాత.. దాని సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం శాండల్ వుడ్ తో పాటు.. దేశంలోని యశ్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఎదురుచూపులకు ఏప్రిల్ 14న తెరపడనుంది. KGF Chapter 2 సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లపై దృష్టి పెట్టారు. ఇటీవలే సినిమా నుంచి తుఫాన్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా KGF Chapter 2 థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF Chapter 2 సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు సాయంత్రం 6.40 గంటలకు KGF Chapter 2 తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు అయిన కరణ్ జోహార్ ఈ ఈవెంట్ ను హోస్ట్ చేయనుండగా.. కన్నడ ట్రైలర్ ను కన్నడ నటుడు శివరాజ్ కుమార్ లాంచ్ చేస్తారని మేకర్స్ ప్రకటించారు. రామ్ చరణ్ ఈవెంట్ లో పాల్గొంటుండటంతో తెలుగు విలేఖరులు కూడా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రావు రమేష్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.
News Summary - Mega Power Star Ram Charan to Launch KGF Chapter 2 Telugu Trailer Today
Next Story