Mon Dec 23 2024 03:44:57 GMT+0000 (Coordinated Universal Time)
భోళా శంకర్ ట్రైలర్.. తేడా కొట్టదు కదా మెహర్
మెగా స్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
మెగా స్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సినిమా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. మొదటి నుండి సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ అంటూ చెప్పుకొస్తున్నారు. పాటలు, టీజర్, ట్రైలర్ లు అన్నిట్లోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
'భోళా శంకర్' ట్రైలర్లో చిరు కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ వైపే దృష్టి పెట్టాడు. సినిమాలో మంచి టైమింగ్ ఉన్న కామెడీ సీన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' సినిమాకు రీమేక్‌గా 'భోళా శంకర్' వస్తున్న విషయం తెలిసిందే. 'హౌరా బ్రిడ్జి దగ్గర ఇంకో అమ్మాయి మిస్సింగ్ అంట సార్.. అంటూ సాగే సంభాషణలతో మొదలైంది ట్రైలర్. పబ్లిక్కు ప్రాబ్లమ్ వస్తే పోలీసుల దగ్గరకు పోతరు. కానీ పోలీసులకు ప్రాబ్లమ్ వస్తే భోళాభాయ్ దగ్గరకు వస్తారు. ‘నీ వెనక మాఫియా ఉంటే.. నా వెనుక దునియా ఉంది బే.' అంటూ ట్రైలర్ సాగుతుంది. ఓ అన్నయ్య తన చెల్లెలిని మాఫియా నుండి కాపాడుకోవడమే కథ అనే పక్కా కమర్షియల్ ఎలిమెంట్ తో సినిమా రూపుదిద్దుకుంది. తెలుగు ఆడియన్స్ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండి అదే తరహా కథ కోసం ఎదురుచూస్తూ ఉండగా.. పూర్తీ మాస్ సినిమాతో మెహర్ సినిమాను తీసుకుని వస్తూ ఉన్నాడు. కొంచెం సినిమాకు రొటీన్ రొట్ట అనే టాక్ వస్తే చాలా కష్టమే..!
కీర్తిసురేశ్ చిరంజీవి సోదరిగా నటిస్తోంది. హీరోయిన్ గా తమన్నా సందడి చేయనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. భోళా శంకర్‌లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, రష్మీ గౌతమ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Next Story