Sat Nov 23 2024 08:39:21 GMT+0000 (Coordinated Universal Time)
లతా దీదీ ఇక లేరంటే గుండె పగిలినట్టుంది : చిరంజీవి
సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు చెందిన ప్రముఖులంతా లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్
జనవరి మొదటి వారంలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గొంతు శాశ్వతంగా మూగబోయింది. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఆమె.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిన్న ఆమె ఆరోగ్యం మరింత విషమించిందని చెప్పిన ఆస్పత్రి వర్గాలు.. ఆదివారం ఈ చేదు నిజాన్ని వెల్లడించారు. లతా మృతితో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు చెందిన ప్రముఖులంతా లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ లతా మంగేష్కర్ మృతిపై ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. "నైటింగేల్ ఆఫ్ ఇండియా, గొప్ప లెజెండ్లలో ఒకరైన లతా దీదీ ఇక లేరు అంటే గుండె పగిలినట్టు ఉంది. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపారు. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతుంది. ఆమె ఆత్మకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశారు. ఇటీవలే కరోనా బారిన పడిన చిరంజీవి.. ఈ ట్వీట్ కు ముందే.. తాను కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు. మీ అందరి ప్రేమ, ఆశీస్సుల వల్ల కోలుకోగలిగానని ట్వీట్ లో పేర్కొన్నారు.
Next Story