Sun Dec 22 2024 23:23:59 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవికి బలవంతంగా కేక్ తినిపించబోయాడు.. ఏమైందో తెలుసా?
మరణమృదంగం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవిపై
శివ శంకర వరప్రసాద్.. చిరంజీవిగా మారి.. మెగాస్టార్ గా వెలుగొందుతూ ఉన్నారు. ఆయన అంత సింపుల్ గా మెగా స్టార్ అవ్వలేదు. ఆయన ఎదుగుతున్న సమయంలో కొందరు అడ్డుకోడానికి ఎంతగానో ప్రయత్నించారు. అవన్నీ దాటుకుని చిరంజీవి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. ఒకానొక సమయంలో చిరంజీవిపై విషప్రయోగం కూడా జరిగింది. ఆయనపై విష ప్రయోగానికి సంబంధించిన పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆయన కూడా దీనిపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.
“మరణమృదంగం” సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవిపై విషప్రయోగం జరిగింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో కొంతమంది అభిమానులు వచ్చారు.. అభిమానుల్లో ఒకరి పుట్టినరోజు అని షూటింగ్ చేస్తున్న చిరంజీవిని ప్రత్యేకంగా కేక్ కటింగ్ ప్రోగ్రాం ఉందని చెప్పడంతో కాదనలేక వెళ్లారు. కేక్ కట్ చేసిన అభిమాని.. ఒక కేక్ ముక్కను చిరంజీవికి తినిపించాలని ప్రయత్నం చేశాడు. చిరంజీవి తాను తినను అని నిర్మొహమాటంగా చెప్పినా గానీ బలవంతంగా చిరంజీవి నోట్లో పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో తోపులాట జరగడంతో కేకు మొత్తం కింద పడిపోయింది. కేక్ మధ్యలో రంగు అధికంగా ఉండడంతో చిరంజీవికి అనుమానం వచ్చి నోరు మొత్తం శుభ్రం చేసుకున్నారు. పెదవులు నీలం రంగులోకి మారిపోయాక.. వెంటనే సినిమా అసిస్టెంట్ ని పిలిచి లిప్ కి లిప్ స్టిక్ వేయాలని కోరాడు. రంగు ఇంకా మారుతూ ఉండటంతో వెంటనే చిరంజీవిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చిరంజీవిపై విషప్రయోగం జరిగిందని వైద్యులు తెలియజేయగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ రోజంతా హాస్పిటల్ లోనే ఉండి వైద్యుల సూచనతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ విషయంపై ఇటీవల కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చిరంజీవి. అది చేసింది తనకు బాగా తెలిసిన అభిమాని అని కూడా అన్నారు.
Next Story