Sat Dec 21 2024 10:08:11 GMT+0000 (Coordinated Universal Time)
మృత్యువుతో పోరాడుతున్న నాగరాజును కలుసుకున్న మెగాస్టార్
మృత్యువుతో పోరాడుతున్న నాగరాజును కలిసిన మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి.. ఆయనపై అభిమానులు చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తన అభిమానుల గురించి చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. తన అభిమానులకు ఏమైనా అయితే ఊరికే చూస్తూ ఉండలేరు. కష్టాల్లో ఉన్న ఎంతో మంది అభిమానులను చిరంజీవి ఆదుకున్నారు. ఆరోగ్యం క్షీణించి చావు బతుకుల మధ్య పోరాడుతున్న ఎంతో మంది అభిమానుల చివరి కోరిక ఏమిటంటే చిరంజీవిని కలవడమే అని చెబుతూ ఉంటారు. అలాంటి ఎంతో మంది ఆఖరి కోరిక తీర్చారు చిరంజీవి.
తాజాగా కూడా ఒక అభిమాని కోరికను తీర్చారు చిరంజీవి. తన సొంతూరు మొగల్తూరుకు చెందిన ఓ అభిమాని చివరికోర్కె తీర్చారు. ఆ అభిమాని పేరు నాగరాజు. నాగరాజుకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. తన చివరికోర్కెగా మెగాస్టార్ చిరంజీవిని కలవాలనుందని మనసులో మాట వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి నాగరాజును తన నివాసానికి ఆహ్వానించారు. మృత్యువుతో పోరాడుతున్న తన వీరాభిమానిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకునిపరామర్శించారు. దాదాపు గంటపాటు ఆ అభిమానితో ముచ్చటించారు. అతడిలో మానసిక స్థైర్యం కలిగించడమే కాదు, ఆర్థికసాయం కూడా అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
Next Story