Sun Dec 22 2024 21:25:48 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబును కలిసిన చిరంజీవి
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి కన్నుమూశారు.
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి కన్నుమూశారు. వారి కుటుంబాలను పలువురు టాలీవుడ్ ప్రముఖులు పరామర్శిస్తూ వచ్చారు. నిన్న కలవలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి నేడు కృష్ణ, మహేశ్ బాబులను కలిశారు. వారిద్దరినీ పరామర్శించారు. ఈ ఉదయం ఘట్టమనేని వారి ఇంటికి వెళ్లిన చిరంజీవి అక్కడ ఇందిరా దేవి చిత్రపటానికి నివాళులు అర్పించారు. కృష్ణతో మాట్లాడారు.
చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించారు. ఆ ఈవెంట్ కు హాజరవ్వడం కోసం చిరంజీవి వెళ్లారు. ఆ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడే ముందు కూడా ఇందిరా దేవిని తలచుకున్నారు. అంతకు ముందు ట్విట్టర్ లో కూడా ''శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను'' పోస్టు పెట్టారు చిరంజీవి.
సీనియర్ కథానాయకుడు కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి. వీరికి ముగ్గురు అమ్మాయిలు.. పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని. ఇద్దరు కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబు. ఈ ఏడాది జనవరిలో రమేష్ బాబు చనిపోయారు. ఇప్పుడు ఇందిరా దేవి కూడా చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story