Sun Dec 22 2024 23:36:18 GMT+0000 (Coordinated Universal Time)
అందరి నోళ్లు మూత పడేలా.. ఆ సినిమా చేయనున్న మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఆయన నటించబోయే రెండు సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చేశాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరో చిత్రంలో చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి 157వ సినిమాను యూవీ సంస్థ తెరకెక్కించనుంది.‘బింబిసార’ వంటి సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందించిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా పంచభూతాలు అనే థీమ్ తో రానున్నట్లు పోస్టర్స్ ను చూస్తే మనకు తెలుస్తుంది. ‘ఈ సారి విశ్వానికి మించి’ అని ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. చిరంజీవి కోసం వశిష్ఠ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు తెలుస్తోంది.
తన కుమర్తె సుస్మిత సొంత బ్యానర్లోనూ చిరంజీవి నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా ఈ రోజు వచ్చింది. 156వ సినిమాను చిరంజీవి తమ బ్యానర్లో చేస్తున్నారని తెలియజేయడానికి సంతోషంగా ఉందంటూ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ‘‘నాలుగు దశాబ్దాలుగా వెండితెరను శాసిస్తున్న రాజసం.. తెరపైనే కాకుండా బయట కూడా బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి.. ‘మెగా 156’ సినిమాను మా బ్యానర్లోనే చేస్తున్నారు” అని పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా షేర్ చేసింది. అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియజేయలేదు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసి చిరంజీవికి వినిపించారని సమాచారం. ఆ కథను ఆయన ఫైనల్ కూడా చేశారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ను ఒక యంగ్ డైరెక్టర్ కు ఇవ్వనున్నట్లు సమాచారం. రీమేక్ లు వద్దే వద్దని కామన్ ఆడియన్స్, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున చెబుతూ ఉన్న సమయంలో వశిష్ఠతో సినిమా చేస్తూ ఉండడం అభిమానులకు ఓ గుడ్ న్యూస్. సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా కూడా రీమేక్ అవ్వకుంటే అదే హ్యాపీ అని నెటిజన్లు చెబుతున్నారు.
Next Story