Thu Mar 13 2025 16:49:58 GMT+0000 (Coordinated Universal Time)
ఏడు రోజుల క్రితమే ఫోన్ చేశా.. చిరంజీవి భావోద్వేగం
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తనను కలచివేసిందని చిరంజీవి అన్నారు.

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తనను కలచివేసిందని చిరంజీవి అన్నారు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లేముందు తాను ఫోన్ చేసి సీతారామ శాస్త్రి తో మాట్లాడనన్నారు. ఆయన ఆరోగ్యం బాగా లేదని తెలిసి చెన్నైలోని అత్యాధునిక ఆసుపత్రిలకి వెళదామని చెప్పానని, అయితే వారం రోజుల్లో కిమ్స్ నుంచి తిరిగి వస్తానని, అప్పటికీ ఉపశమనం కలగకపోతే తప్పకుండా చెన్నైకి వెళదాము మిత్రమా అని తనతో అన్నారని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు.
సాహిత్యానికి చీకటి రోజు....
ఇలా జీవం లేకుండా వస్తారని తాను ఊహించలేదని అన్నారు. ఇద్దరం ఒకే వయసు వారమని అని గుర్తు చేసుకున్నారు. తాను నటించిన రుద్రవీణలో తరలి రాగ తనే వసంతం పాట రాశారని, అది తనకు ఎంతో ఇష్టమైన పాట అని చిరంజీవి అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబంలో తనను ఒక సభ్యుడిగా చూసేవారన్నారు. ఆయన మరణం సినీ సాహిత్యానికి తీరని లోటని చిరంజీవి చెప్పారు.
Next Story