Sun Dec 22 2024 13:55:25 GMT+0000 (Coordinated Universal Time)
విశ్వంభర టీజర్ వచ్చేసింది.. మైనస్ అదేనంటూ విమర్శలు!!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. బింబిసార సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా టీజర్ ను చూస్తే ఓ దుష్టశక్తిని అంతం చేయడానికి పుట్టిన కారణజన్ముడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తూ ఉన్నారు. సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ మూవీలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్తో మూవీని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు. అయితే టీజర్ లోని వీఎఫ్ఎక్స్ విషయంలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండడంతో అప్పట్లోపు వీఎఫ్ఎక్స్ బెటర్ అవుతాయంటూ మరికొందరు సర్ది చెబుతున్నారు. అయితే చిరంజీవి రీమేక్ లు కాకుండా కొత్త కథతో వస్తుండడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. బాస్ సోషియో ఫాంటసీ సినిమాల్లో నటించి చాలా కాలమైందని తాము చూడ్డానికి సిద్ధంగా ఉన్నామంటూ మెజారిటీ మూవీ లవర్స్ చెబుతున్నారు.
Next Story