Mon Dec 15 2025 04:13:20 GMT+0000 (Coordinated Universal Time)
కదలలేని స్థితిలో కైకాల సత్యనారాయణ.. చిరంజీవి వెళ్లి
కదలలేని స్థితిలో కైకాల సత్యనారాయణ.. చిరంజీవి వెళ్లి

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కైకాల ప్రస్తుతం బెడ్పైనే చికిత్స తీసుకుంటున్నారు. దాదాపుగా కదలలేని స్థితిలో ఉన్న ఆయన వద్దకు చిరు స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా బెడ్పై దానిని పెట్టి కైకాల చేత కట్ చేయించారు. కైకాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపానని, అది తనకు ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చిందని చిరు పేర్కొన్నారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ ఆయన ఆకాంక్షించారు. కైకాల సత్యనారాయణ కేక్ కట్ చేస్తున్న ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నేడు. 1935 జులై 25న జన్మించిన కైకాల 87వ వసంతలోకి అడుగుపెట్టారు. పెద్దలు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నాడు ఆయన్ని స్వయంగా కలవడం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను… అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి, కైకాల కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. చిరంజీవి చిత్రాల్లో కైకాల విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా, కమెడియన్ గా కూడా చేశారు. కొన్నాళ్లుగా వయో సంబంధింత సమస్యలతో బాధపడుతున్న కైకాల ఇంటికే పరిమితం అవుతున్నారు. గత ఏడాది ఆయన ఆరోగ్యం విషమించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు.
Next Story

