Mon Dec 23 2024 10:46:27 GMT+0000 (Coordinated Universal Time)
మనవరాలి రాకపై.. "చిరు" ట్వీట్
దీంతో మెగా - కామినేని - అల్లు కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ
మెగా కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని అపోలోఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా - కామినేని - అల్లు కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ #MegaPrincessను ట్రెండ్ చేస్తున్నారు. ఇక తాజాగా మనవరాలి రాకపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
"మెగా లిటిల్ ప్రిన్సెస్ కు స్వాగతం. నీ రాకతో కోట్లాది మంది మెగా అభిమానులకు ఆనందాన్ని పంచావు. చరణ్ - ఉపాసన దంపతులను తల్లిదండ్రుల్ని చేశావు. మమ్మల్ని తాతయ్య-నానమ్మలను చేశావు. ఎంతో ఆనందంగా - గర్వంగా ఉంది" అని చిరంజీవి మనవరాలి రాకపై ట్వీట్ చేశారు. ఇటీవలే చెర్రీ-ఉప్సీ పెళ్లి రోజున కూడా చిరంజీవి ట్వీట్ చేశారు. మీ సంతానంపై చూపించే ప్రేమ అందరికీ ఆదర్శం కావాలని పేర్కొన్నారు.
తల్లిదండ్రులైన చరణ్ దంపతులకు జూ.ఎన్టీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. కూతురితో గడిపిన ప్రతిక్షణం జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందని, ఎప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా అంతట ప్రస్తుతం.. వీరి గురించే ట్రెండ్ అవుతోంది. అభిమానులంతా చరణ్, ఉపాసన దంపతుల్ని ట్యాగ్ చేస్తూ.. శుభాకాంక్షలు చెబుతున్నారు.
Next Story