Mon Dec 30 2024 19:13:04 GMT+0000 (Coordinated Universal Time)
మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ చూశారా..?
చిరంజీవి ట్విట్టర్ లో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా.. రామ్ చరణ్ కు సంబంధించిన ఓ వీడియోను..
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..! అయితే తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా పేరును మార్చేశారు. ట్విట్టర్ అకౌంట్ లోనూ చిరంజీవి ఆచార్యగా మారిపోయారు. తన ట్విట్టర్ ఖాతా పేరును 'ఆచార్య'గా మార్చుకున్నారు.
చిరంజీవి ట్విట్టర్ లో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా.. రామ్ చరణ్ కు సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే..! సిద్ధ లుక్ లో రామ్ చరణ్ ఉండగా.. ఓ కోతి వచ్చి సందడి చేస్తుండడం వీడియోలో చూడచ్చు. కాటేజీలో మేకప్ వేసుకుంటూ రామ్ చరణ్ రెడీ అవుతుండగా ఓ వానరం అక్కడకు వచ్చింది. మేకప్ వేసుకున్నంత సేపు అక్కడే ఉంది. మేకప్ వేసుకోవడం పూర్తయిన తర్వాత చరణ్.. ఆ వానరానికి బిస్కెట్లను అందించాడు.
చిరంజీవి- చరణ్ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందింది. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి - అవినాష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, కాజల్, పూజ హెగ్డే కథానాయికలుగా అలరించనున్నారు. ఇటీవలే ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, 29వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.
Next Story