Sat Dec 21 2024 06:55:58 GMT+0000 (Coordinated Universal Time)
కొడుకు రామ్ చరణ్ పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..
ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్.. తన కుమారుడి అచీవ్ మెంట్ పై సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'నాన్నా...
టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా పేరుగడించారు. ఇటీవలే జపాన్ లోనూ ఈ సినిమాను విడుదల చేశారు. తాజాగా రామ్ చరణ్ ఓ విశేషమైన అవార్డును అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వ్యక్తులకు జాతీయ మీడియాసంస్థ ఈ అవార్డులను అందిస్తోంది. అలా ఎంటర్టైన్ మెంట్ రంగంలో రామ్ చరణ్ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డును అందుకున్నారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్.. తన కుమారుడి అచీవ్ మెంట్ పై సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'నాన్నా... ట్రూ లెజెండ్ అవార్డును గెలుచుకున్న నిన్ను చూసి చాలా గర్విస్తున్నా. ఇలాగే ముందుకు సాగిపోవాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ చిన్న పిల్లాడిగా వాళ్లద్దరిగా కలిసి దిగిన ఫోటోతో పాటు.. అవార్డును అందుకుంటున్న ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నారు చిరంజీవి.
Next Story