Mon Dec 23 2024 03:32:19 GMT+0000 (Coordinated Universal Time)
గాడ్ ఫాదర్ సినిమా టికెట్ల ధర ఎంతో తెలుసా..?
తాజాగా ‘గాడ్‌ఫాదర్’ టిక్కెట్ రేట్లు సాధారణ ధరలకే అందుబాటులో ఉన్నాయి.ఆచార్య సినిమాకు మాత్రం అప్పుడు సింగిల్ థియేటర్లో
మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ఫాదర్' సినిమా ఇంకొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్టయిన 'లూసీఫర్'కు రీమేక్‌గా తెరకెక్కింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సల్మాన్‌ఖాన్ అతిధి పాత్రలో నటించగా సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో అక్టోబర్ 5న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా బృందం ప్రమోషన్స్ ను కూడా భారీగా చేస్తోంది.
తాజాగా 'గాడ్‌ఫాదర్' టిక్కెట్ రేట్లు సాధారణ ధరలకే అందుబాటులో ఉన్నాయి. 'ఆచార్య' సినిమాకు సింగిల్ థియేటర్లో రూ.200 ఉంది. ఇప్పుడు రూ. 50 తగ్గించి, రూ.150 చేశారు. ఆచార్య సినిమా కలెక్షన్లు అంత తక్కువ రావడానికి ఒక రకంగా టిక్కెట్ రేట్లు కూడా కారణం అయ్యాయి. ఇక 'గాడ్‌ఫాదర్' విషయంలో అలాంటి తప్పు చేయకూడదని మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి టిక్కెట్ రేట్లను తగ్గించారనే టాక్ వినపడుతూ ఉంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా కాస్త ఆసక్తిని కనబరుస్తూ వస్తోంది. పవర్ఫుల్ డైలాగులు, పవర్ పంచ్‌లు, యాక్షన్ సీన్స్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ స్పెషల్ ఎంట్రీతో ట్రైలర్ నిండిపోయింది. ఇక కలెక్షన్స్ ను ఏ మాత్రం మెగాస్టార్ రాబడుతాడో చూడాలి.
Next Story