Tue Apr 01 2025 03:21:04 GMT+0000 (Coordinated Universal Time)
కన్నీటి పర్యంతమైన మెగాస్టార్
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ భౌతిక కాయాన్ని చూసి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ భౌతిక కాయాన్ని చూసి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని చిరంజీవి బాధపడుతుండటం కనిపించింది. సత్యనారాయణ మృతి చెందారని తెలిసిన వెంటనే ఆయన ఇంటికి వచ్చి పార్థీవదేహానికి చిరంజీవి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులతో....
అక్కడే ఉండి కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడారు. తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని మరీ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. సత్యనారాయణ పుట్టినరోజు నాడు ఆయన ఇంటికి వెళ్లి పలకరించి బొకే ఇచ్చి కేక్ కట్ చేయించారు. ఆ ఆనందమైన క్షణాలను చిరంజీవి ఈరోజు గుర్తుకు తెచ్చుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
Next Story