Sun Dec 22 2024 19:04:32 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : కొండా వ్యాఖ్యలపై చిరంజీవి సీరియస్ కామెంట్స్
మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ఆయన ఎక్స్ లో తీవ్ర స్థాయిలోనే పోస్టు పెట్టారు. మహిళ మంత్రిగా ఉండి అవమానకర చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని తెలిపారు. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని చిరంజీవి అన్నారు.
మహిళలను లాగవద్దంటూ...
రాజకీయాలతో సంబంధం లేని, మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దంటూ సున్నితంగా హెచ్చరించారు. సమాజాభివృద్ధి కోసం తాము నాయకులను ఎన్నుకుంటామని, ఇలాంటి వ్యాఖ్యలను చేసి తమస్థాయిని తగ్గించుకోకూడదని సూచించారు. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరారు.
Next Story