Thu Dec 26 2024 14:22:27 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ తో చిరు భేటీ పై మంచు కీలక కామెంట్స్
ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతమని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు
సినిమా టిక్కెట్ల ధరలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతమని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశానికి, ఇండ్రస్ట్రీ కి ముడిపెట్టవద్దని కోరారు. తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచారని, ఏపీలో మూవీ టిక్కెట్ల ధరలను తగ్గించారని, రెండు అంశాలపై కోర్టుకు వెళ్లారన్నారు. ఫిలిం ఇండ్రస్ట్రీ అంతా ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు.
అందరూ ఏకమైతేనే....
అందరూ ఏకతాటిపైకి వస్తే సమస్యకుక పరిష్కారం దొరుకుతుందన్నారు. రెండు ప్రభుత్వాలు ఫిలిం ఇండ్రస్ట్రీకి సహకరిస్తున్నాయని మంచు విష్ణు చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన జీవోలపైన, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నలుగురి కోసం తెచ్చిన అప్పటి జీవోలపై కూడా చర్చించాలన్నారు. అందరూ కలసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలన్నారు. సమస్యలపై ఎవరికీ వ్యక్తిగత అభిప్రాయం ఉండదన్నారు. తిరుపతిలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంచు విష్ణు ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story