Tue Dec 24 2024 00:49:20 GMT+0000 (Coordinated Universal Time)
ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నా
జీవితాంతం తాను సినిమాలను వదలిపెట్టబోనని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
జీవితాంతం తాను సినిమాలను వదలిపెట్టబోనని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన జీవితంలో మరచిపోలేని రోజు ఇది అని అన్నారు. ఈక్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నానని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ముగింపు ఉత్సవాలకు హాజరైన ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
ఎల్లలు లేనిది సినిమా...
ఈ అవార్డు తన అభిమానుల్లో ఎనలేని సంతోషాన్ని నింపిందన్నారు. తనకు యువ హీరోలు పోటీ కాదని, వాళ్లకు తాను పోటీ అని అన్నారు. తనను ఇంత దూరం తీసుకు వచ్చిన అభిమానులకు తాను జీవితాంతం రుణ పడి ఉంటానని తెలిపారు. ప్రధాని మోదీకి చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమాకు ఎల్లలు లేవని అన్నారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఏ ప్రాంత ప్రజలైనా ఆదరిస్తారని ఆయన పేర్కొన్నారు. సరైన సమయంలో ఈ అవార్డు తనకు వచ్చినట్లు భావిస్తున్నానని తెలిపారు. ప్రాంతీయ అభిమానాలు పోయి భారతీయ సనిమా వచ్చిందన్నారు.
- Tags
- chiranjeevi
- award
Next Story