ఆ రెండు విషయాలే టెన్షన్ పెడుతున్నాయి
స్వతంత్ర పోరాట వీరుడి నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈమూవీ కి సంబందించిన టీజర్ నిన్నే రిలీజ్ అయ్యి సెన్సేషన్ [more]
స్వతంత్ర పోరాట వీరుడి నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈమూవీ కి సంబందించిన టీజర్ నిన్నే రిలీజ్ అయ్యి సెన్సేషన్ [more]
స్వతంత్ర పోరాట వీరుడి నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈమూవీ కి సంబందించిన టీజర్ నిన్నే రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నెగటివ్ ఎక్సపెక్టషన్ తో ఉన్న చాలామంది ఈ టీజర్ చూసి షాక్ అయ్యారు. అన్ని భాషల్లో రిలీజ్ అయినా ఈ టీజర్ కి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. టీజర్ మొత్తం చూస్తే యాక్షన్ ఘట్టాలు, సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి అని అర్ధం అవుతుంది.
ఇక ఈమూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2 న రిలీజ్ కానుంది. అంత బాగానే ఉంది కానీ రెండు విషయాల్లో మాత్రం తేడా కొడుతోంది. అవే చిరు లుక్ అండ్ తన వాయిస్. ఈచిత్రం కి చిరు కు స్టైలింగ్ చేసింది స్వయంగా ఆయన తనయురాలే. ఈమె చిరు రీఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150కి కూడా పని చేసింది. అయితే సైరా లో ఆమె తో పాటు కొంతమంది నిపుణులు, చరిత్రకారుల సాయం తీసుకుని చిరుకు లుక్ ఫైనల్ చేసినట్లు సమాచారం. కానీ లుక్ చూస్తే బాగోలేదు.
కొన్ని సార్లు బాగానే అనిపిస్తున్నా.. కొన్ని షాట్లతో తేడాగా అనిపించింది. చిరు కి ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదు. అలానే చిరు వాయిస్ విషయంలో ముందు నుంచి ఉన్న ఆందోళనను తాజా టీజర్ పెంచింది. ఒక వీరుడి వాయిస్ ఉండాల్సినట్లుగా లేదు. గొంతు కొంచెం బొంగురుపోయి, బలహీన పడింది. ఈ రెండు విషయాలే అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలను టెన్షన్ పెడుతున్న విషయాలు.