Mon Dec 23 2024 17:44:36 GMT+0000 (Coordinated Universal Time)
రేపే మెగాస్టార్ బర్త్ డే.. నేడు గాడ్ ఫాదర్ నుంచి టీజర్ రిలీజ్
తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మెగాస్టార్ అదిరిపోయే ట్రీట్ లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు ఆయన ఫామిలీతో పాటు అభిమానులు సిద్ధమవుతున్నారు. గతంలో ఏ హీరోకి చేయని విధంగా.. ఈసారి హైదరాబాద్ హైటెక్స్ లో మెగా కార్నివాల్ ను నిర్వహిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మెగాస్టార్ అదిరిపోయే ట్రీట్ లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేడు గాడ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్ విడుదల కానుంది. మెగాస్టార్ బర్త్డే కానుకగా గాడ్ఫాదర్ చిత్రం నుండి టీజర్ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా టీజర్ కోసం అందరూ ఆతృతగా చూస్తున్నారు.
ఆగస్టు 21 సాయంత్రం 6.30 గంటలకు టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ టీజర్ లో మెగాస్టార్ ఎలా కనిపించనున్నారు ? టీజర్ ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
Next Story