మెగాస్టార్ అయితే నాకేంటి?
కొరటాల శివ – చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా త్వరలోనే మొదలు కాబోతుంది. ఆగష్టు నుండి ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరో పక్క [more]
కొరటాల శివ – చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా త్వరలోనే మొదలు కాబోతుంది. ఆగష్టు నుండి ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరో పక్క [more]
కొరటాల శివ – చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా త్వరలోనే మొదలు కాబోతుంది. ఆగష్టు నుండి ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరో పక్క సైరా నరసింహారెడ్డి విడుదల తర్వాతే కొరటాల శివ – చిరు సినిమా మొదలవుతుంది అని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎప్పుడో స్క్రిప్ట్ లాక్ చేసిన కొరటాల శివ మిగతా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసాడు. ఇక ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక లో మెగా స్టార్ చిరు పక్కన నటించబోయే హీరోయిన్ సమస్యగా మారింది. నిన్నమొన్నటివరకు నయనతార, అనుష్క, విజయశాంతి పేరు వినబడ్డాయి.
ఐష్ అయితే బాగుంటుందని….
తాజాగా బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్ పేరు కాస్త గట్టిగానే వినబడింది. కొరటాల శివ చిరు సరసన ఐష్ అయితే బావుంటుందని… చిరు తో క్లోజ్ గా ఉన్న అమితాబ్ ద్వారా రాయబారం పంపారని న్యూస్ వినబడింది. ఇక ఐష్ కూడా సౌత్ లో నటించడానికి సుముఖంగా ఉన్నప్పటికీ.. ఆమె కొరటాల సినిమా కోసం మెగాస్టార్ చిరు సరసన నటించాలంటే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే కాదు.. ఆమె వ్యక్తిగత సిబ్బంది వేతనాలు…. సౌకర్యాల విషయంలో గొంతెమ్మ కోర్కెలు కోరిందట. ఆ దెబ్బకి కొరటాల అండ్ టీం ఈ చిత్రానికి ఐశ్వర్యను తీసుకోవాలనే ఆలోచనను విరమించుకొనే ఆలోచనలో ఉందని సమాచారం. మరి ఐష్ వాలకం చూస్తుంటే మెగాస్టార్ అయితే నాకేంటి అన్నట్టుగా లేదూ.. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్ లో ఐష్ కి పెద్దగా సినిమాలు కూడా లేవు. అయినా ఐష్ ఇలా చేస్తుంది.