Mon Dec 23 2024 16:01:43 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేక్షకులకు షాకిచ్చిన "ప్రేమదేశం".. రేపటి విడుదల వాయిదా
చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. సినిమాకు..
ఛల్ మోహన్ రంగా సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్ ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ..సరైన హిట్ ఇంతవరకూ అందుకోలేక పోయింది. వరుస ఫ్లాపులున్నా సినిమా ఛాన్సులకు కొదువ లేదు. తాజాగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన "ప్రేమదేశం"లో మేఘా ఆకాష్ హీరోయిన్ పాత్ర పోషించింది. అన్ని పనులూ ముగించుకుని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా.. ఆఖరి నిమిషంలో షాకిచ్చింది.
చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. సినిమాకు సంబంధించి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక డిసెంబర్ 9న ఈ సినిమాను థియేటరల్లో రిలీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. అదే రోజున మేఘా ఆకాష్ నటించిన మరో మూవీ 'గుర్తుందా శీతాకాలం' కూడా రిలీజ్ కానుంది. దీంతో డిసెంబర్ 9న మేఘా ఆకాష్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఖాయమంటున్నారు.
Next Story