అమెరికాలో హీరోయిన్ కి చేదు అనుభవం?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అమెరికా లో హీరోయిన్స్ సెక్స్ రాకెట్ విషయంలో అతలాకుతలం అవుతుంది. అమెరికా శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య , హీరోయిన్లతో భారీ ఎత్తున సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఈవెంట్లలలో పాల్గొనే పలు ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లతో వీరు అమెరికాలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ పోలీస్ ల అదుపులో ఉండగా...టాలీవడ్ లోని పలువురు.. చంద్రకళ, శ్రీరాజ్ లు తమని కూడా ట్రాప్ చేశారని కానీ తాము తప్పించుకున్నామని అనసూయ, శ్రీ రెడ్డి వంటి వారు చెప్పడం... ఈ సెక్స్ రాకెట్ వ్యవహారం మరింతగా హాట్ టాపిక్ అయ్యింది.
అయితే తాజాగా ఈ విషయంలో ఒక హీరోయిన్ కి అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో సెక్స్ రాకెట్ అనే న్యూస్ మీద అమెరికా పోలీస్ లు దృష్టి సారించారు అనడం కన్నా.. వారు ఈ వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. అందుకే అమెరికాలో అడుగుపెడుతున్న సౌత్ హీరోయిన్స్ ని వారు క్షుణ్ణంగా ప్రశ్నించి మరీ తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కుటుంబ సభ్యులను కలవడానికి అమెరికా వెళ్లిన మెహ్రీన్ కౌర్ ని కెనడా ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. తన స్నేహితులను కలవడానికి కెనడా వెళుతున్న మెహ్రీన్ ని అక్కడి పోలీస్ లు హీరోయిన్ గా గుర్తించి ఆమెను ప్రశ్నించేందుకు సిద్దమయ్యారట.
ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన మెహ్రీన్... పోలీస్ లు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పి మరి బయటపడిందట. అరగంట సేపు ప్రశ్నించిన పోలీస్ లు మెహ్రీన్ తల్లితండ్రులకోసమే అమెరికా వచ్చిందని తెలుసుకుని... తాము కొన్ని విషయాల్లో ఖఠినముగా ప్రశ్నించినందుకు గాను మెరీనా కి సారి కూడా చెప్పారట. మరి... కొందరు చేసిన అస్సహ్యమైన పనుల వలన మంచి వారికీ కూడా ఇబ్బందులు కలగడం సహజమైన విషయమే అయినప్పటికీ అలాంటి అవమానం కొందరికి బాధానిస్తుంది
- Tags
- మెహ్రీన్ కౌర్