పారితోషకం పెంచేసిందా..?
నటించింది తక్కువ సినిమాలే అయినా... అందులో చాలావరకు హిట్ సినిమాలే ఉన్నాయి. అయినా అమ్మడుకి ఒక స్టార్ హీరో కూడా అవకాశం ఇవ్వడం లేదు. అయినా మీడియం బడ్జెట్ హీరోలతో బాగానే నటించేస్తుంది. ఒకప్పుడు లావుగా ఉండడం వలన రాని అవకాశాలు ప్రస్తుతం సన్నగా తయారవడంతో... మళ్ళీ ట్రాక్ ఎక్కినట్లే కనబడుతుంది మెహ్రీన్ కౌర్. ప్రస్తుతం గ్లామర్ గేట్లను కూడా తెరిచిన మెహ్రీన్ కౌర్ ప్రస్తుతం గోపీచంద్ పక్కన పంతం సినిమాలో నటించింది. ఆ సినిమా రేపు గురువారమే ప్రేక్షకులముందుకు రాబోతుంది.
అలాగే సక్సెస్ ఫుల్ హీరో విజయదేవరకొండ పక్కన తమిళంలో నోటా సినిమాలో నటిస్తుంది. ఇక వరుణ్ తేజ్ పక్కన ఒకసారి ఛాన్స్ మిస్ అయినా.. తాజాగా ఎఫ్ 2 లో వరుణ్ పక్కన నటిస్తుంది. ఇక అవరుసగా అవకాశాలొస్తున్నా ఈ భామ ఇప్పుడు తన పారితోషకాన్ని అమాంతం 20 లక్షలు పెంచేసిందట. అంటే గతంలో అరకోటి అంటే 50 లక్షలు తీసుకునే మెహ్రీన్ ప్రస్తుతం 70 నుండి 75 లక్షలు డిమాండ్ చేస్తుందట. అయితే ప్రస్తుతం హీరోయిన్స్ కొరత ఉన్న టాలీవుడ్ లో దర్శకనిర్మాతలు మెహ్రీన్ అడిగింది ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.
అయితే మెహ్రీన్ ఇలా అకస్మాత్తుగా పారితోషకం పెంచింది ఏ సినిమా కోసమనుకుంటున్నారు. విరించి వర్మ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించే సినిమాకు మెహ్రీన్ కౌర్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకోక తప్పలేదు. అలాగే ప్రస్తుతం ఈ అమ్మడికి తమిళంలో కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి