Sun Dec 22 2024 20:08:31 GMT+0000 (Coordinated Universal Time)
వాల్తేరు వీరయ్య నుండి ఫస్ట్ మెలొడీ అప్డేట్..'నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి'
స్విట్జర్లాండ్ - ఇటలీ బోర్డర్లో ఉన్న ఓ లోయలో -8 డిగ్రీల చలిలో ఈ పాటను ఎంత కష్టమైన ఇష్టంగా పూర్తి చేశామని, మంచుకురుస్తు..
చిరంజీవి-శృతి హాసన్ లు హీరో, హీరోయిన్లుగా.. చిరంజీవి ఫుల్ లెంగ్త్, పక్కా మాస్ క్యారెక్టర్లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పోలీస్ గా నటించినట్లు ఇటీవలే సినిమా వెల్లడించింది. ఈ మేరకు రవితేజ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా.. చిరంజీవి వాల్తేరు వీరయ్యకు సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చారు. ఫ్రాన్స్ లో శృతిహాసన్ - చిరంజీవి మధ్య చిత్రీకరించిన ఓ సాంగ్ గురించి చెప్పారాయన.
స్విట్జర్లాండ్ - ఇటలీ బోర్డర్లో ఉన్న ఓ లోయలో -8 డిగ్రీల చలిలో ఈ పాటను ఎంత కష్టమైన ఇష్టంగా పూర్తి చేశామని, మంచుకురుస్తుండగా అక్కడి అందాలను చూసేందుకు రెండు కళ్లూ చాల్లేదని ఇన్ స్టాలో చెప్పుకొచ్చారు. పాట షూటింగ్ సమయంలో చిరంజీవి తీసిన కొన్ని అందాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. 'నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి' అంటూ ఈ పాట సాగనున్నట్టుగా చెప్పారు. పాటకి సంబంధించిన స్టిల్ లో చిరంజీవి ఫ్లూట్ వాయించే భంగిమలో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక ఆయన సరసన శ్రుతి హాసన్ మంచుకొండల్లో విరిసిన మల్లెమొగ్గలా అందాలు వెదజల్లుతోంది. త్వరలోనే ఈ సినిమా నుండి ఈ పాట లిరికల్ వీడియో విడుదలవుతుందని తెలిపారు.
Next Story