Sun Jan 12 2025 21:56:22 GMT+0000 (Coordinated Universal Time)
లక్షముత్యాల గౌనుతో..మెట్ గాలా లో మెరిసిన అలియా భట్
‘‘సంప్రదాయ తరహాలో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఈ ఎంబ్రాయిడరీని భారత్ లోనే లక్ష ముత్యాలతో రూపొందించారు.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతోన్న ‘మెట్ గాలా 2023’ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ ముత్యాల గౌనుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్షముత్యాలతో రూపొందించిన గౌనును ధరించి ఆ కార్యక్రమానికి హాజరైన అలియా.. అందరి చూపుల్నీ తనవైపుకి తిప్పుకుంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను అలియా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
‘‘సంప్రదాయ తరహాలో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఈ ఎంబ్రాయిడరీని భారత్ లోనే లక్ష ముత్యాలతో రూపొందించారు. దీన్ని ధరించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది’’అని అలియా భట్ ఆ పోస్ట్ లో పేర్కొంది. ఈ ఫొటోలపై ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ప్రశంసలు కురిపించారు. ముత్యాల గౌనులో ఎంతో అందంగా, చూడచక్కగా ఉన్నావంటూ కత్రినా కైఫ్, కరీనా కపూర్, జాన్వీ కపూర్ అలియాభట్ ను మెచ్చుకున్నారు. కాగా.. ఇదే కార్యక్రమంలో ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ ముత్యాలు, రాళ్లు పొదిగిన అంచతో మెరుస్తూ ఉన్న నల్లటి గౌన్ ను ధరించింది.
Next Story