Mon Dec 23 2024 08:06:49 GMT+0000 (Coordinated Universal Time)
ఇజ్రాయెల్ యుద్ధం.. విమర్శలు ఎదుర్కొంటున్న మియా ఖలీఫా..
ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో అడల్ట్ స్టార్ 'మియా ఖలీఫా' చేసిన ఒక ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె పై ప్రపంచం మొత్తం..
ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం చూసి ప్రపంచం మొత్తం ఆవేదన చెందుతుంది. అక్కడ జరుగుతున్న దాడుల్లో అమాయకులైన ప్రజలు, పసి పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. హమాస్ దాడులతో ఇప్పటికే 1500 పైగా ప్రజలు మరణించినట్లు అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది.
ఇక గాయపడిన వారు సంఖ్య అయితే వేల సంఖ్యలో ఉంటుంది. ఇటు ఇజ్రాయిల్ తో పాటు అటు పాలస్తీనాలో కూడా వందల మంది మరణిస్తున్నారు. కాగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులను హింసించి మరి చంపుతున్నారు. అంతేకాదు ఆ హింసని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ విషయం గురించే అడల్ట్ స్టార్ 'మియా ఖలీఫా' ఒక ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది.
మియా ఖలీఫా చేసిన ట్వీట్ ఏంటంటే.. ఇజ్రాయెల్ పౌరులను హింసిస్తూ హమాస్ తీవ్రవాదులు చిత్రీకరిస్తున్న వీడియోలను నిలువుగా కాకుండా ఫోన్ అడ్డంగా పెట్టి తియ్యాలంటూ" ఆమె ట్వీట్ చేసింది. ఇక ట్వీట్ పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాటి మానుషాలను హింసిస్తుంటే.. నువ్వు స్పందించే తీరు ఇదేనా..? అంటూ ఆమె పై మండిపడుతున్నారు. ఇక ఈ ట్వీట్ విషయంలో మియా తీరుని ఖండిస్తూ.. ప్లేబోయ్ సహా పలు సంస్థలు మియా ఖలీఫాతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.
Next Story