Mon Dec 23 2024 05:47:58 GMT+0000 (Coordinated Universal Time)
మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.. రిలీజ్ డేట్ వచ్చేసింది
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా.. యువీ క్రియేషన్స్ సినిమాను..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందింది. టాలీవుడ్ దేవసేన.. చివరిగా 2020లో ఓటీటీలో విడుదలైన నిశ్శబ్దం సినిమాలో కనిపించింది. ఆ తర్వాతి నుండి ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు అనుష్క. గతంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తుండగా.. అతనికి జోడీగా అనుష్క నటిస్తోంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా.. యువీ క్రియేషన్స్ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఆగస్టు 4న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా అనుష్క చెఫ్ గా కనిపిస్తుంటే, నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. మూడేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో.. స్వీటి అభిమానులు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సౌత్ లో నాలుగు భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
Next Story