Fri Dec 27 2024 01:30:40 GMT+0000 (Coordinated Universal Time)
తాప్సీ 'మిషన్ ఇంపాజిబుల్' ఓటీటీ విడుదల ఎప్పుడంటే
ఇటీవల తెలుగులో కూడా ఒక మిషన్ ఇంపాజిబుల్ రిలీజ్ అయింది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడి నుండి వచ్చిన సినిమా..
హైదరాబాద్ : మిషన్ ఇంపాజిబుల్.. అనగానే హాలీవుడ్ యాక్షన్ సినిమాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా టామ్ క్రూజ్ చేసే యాక్షన్ అంటే చాలా మందికి ఇష్టం. ఇటీవల తెలుగులో కూడా ఒక మిషన్ ఇంపాజిబుల్ రిలీజ్ అయింది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడి నుండి వచ్చిన సినిమా.. తాప్సీ లీడ్ రోల్ చేసింది.. ముగ్గురు పిల్లల చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి వచ్చారు.. అలాగే ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది. కానీ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాల మధ్య రిలీజ్ చేయడం కూడా సినిమాకు పెద్ద మైనస్ అయిందని టాక్ నడిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది ఈ సినిమా.
స్వరూప్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమా ఏప్రిల్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ మూవీలో హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ మొలుగు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. పలు సినిమాలు వెండితెర మీద పెద్దగా ప్రభావం చూపకపోయినా.. కొన్ని సినిమాలు ఓటీటీలో భారీగా హిట్ అయ్యాయి. ఆ కోవలోకి ఈ సినిమా కూడా వస్తుందేమో చూడాలి.
Next Story