Mon Dec 23 2024 13:25:00 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రముఖి 2.. భయపడ్డానని చెప్పిన కీరవాణి
చంద్రముఖి సినిమా భారీ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో కామెడీకి, హారర్ కు ఎంతో
చంద్రముఖి సినిమా అటు తమిళంలోనూ, తెలుగు లోనూ భారీ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..! ఈ సినిమాలో కామెడీకి, హారర్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తూ ఉన్నారు. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీమీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే లారెన్స్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాడు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
తాజాగా కీరవాణి చంద్రముఖి సినిమాపై ఓ పోస్టు పెట్టారు. తాను 'చంద్రముఖి 2' సినిమా చూశానని ఆయన అన్నారు. సినిమాలోని పాత్రలకు మరణభయంతో కంటిమీద కునుకు లేకుండా పోయిందని.. అయితే నా పరిస్థితి కూడా అంతే! అద్భుతమైన సన్నివేశాలకు సంగీతంతో ప్రాణం పోసేందుకు రెండు నెలలపాటు నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. సినిమా విజయం సాధించాలని కోరుకోవాలని ట్వీట్ చేశారు. త్వరలోనే చంద్రముఖి –2 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని భావిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 19న పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది.
Next Story