Fri Nov 22 2024 23:19:46 GMT+0000 (Coordinated Universal Time)
జనసంద్రాన్ని తలపించిన మొగల్తూరు.. 25వేల టన్నుల నాన్ వెజ్ వంటకాలు
సెక్యూరిటీ దృష్ట్యా ఇంటి ప్రాంగణం నుంచే అభిమానులకు అభివాదం చేసి, వచ్చిన ప్రతిఒక్కరూ భోజనం చేసి వెళ్లాలని కోరారు ప్రభాస్.
రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరుకు విచ్చేశారు. 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరుకు వచ్చారని తెలిసిన అభిమానులు.. తమ అభిమాన హీరోని చూసేందుకు పోటెత్తారు. అభిమానుల రాకతో మొగల్తూరు జనసంద్రాన్ని తలపించింది. ప్రభాస్ ని చూసేందుకు కొందరు అభిమానులు చెట్లు, స్తంభాలు ఎక్కారు. తనకోసం వచ్చిన అభిమానులకు ప్రభాస్ అభివాదం చేశారు.
సెక్యూరిటీ దృష్ట్యా ఇంటి ప్రాంగణం నుంచే అభిమానులకు అభివాదం చేసి, వచ్చిన ప్రతిఒక్కరూ భోజనం చేసి వెళ్లాలని కోరారు ప్రభాస్. ఇక కృష్ణంరాజు సంస్మరణ సభకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సంస్మరణ సభకు విచ్చేసిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఎన్నిరకాల వంటకాలు ఏర్పాటు చేశారో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే. 9 టన్నుల మటన్, 6 టన్నుల చికెన్, 6 టన్నుల రొయ్యలు, 4 టన్నుల ఫిష్ వంటకాలను తయారు చేయించారట. భోజనంలో మూడు రకాల నాన్ వెజ్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై వడ్డించారు. వెజ్ వంటకాలు అంతకుమించే ఉన్నాయి. మొత్తంగా 50 రకాల వంటకాలు చేయించి అతిథులు, అభిమానులకు వడ్డించారు. ఎంతైనా రాజులు కదా.. ఆ మాత్రం ఉంటుందనుకుంటున్నారు అభిమానులు. ప్రభాస్ మొగల్తూరు రావడంతో సోషల్ మీడియాలో #PrabhasatMogalthuru ట్రెండింగ్ లో నిలిచింది.
Next Story