Mon Dec 23 2024 11:28:49 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణ భౌతికకాయాన్ని చూసి.. బోరున విలపించిన మోహన్ బాబు
మరోవైపు కృష్ణ భౌతికకాయాన్ని చూసి మోహన్ బాబు చలించిపోయారు. భోరున విలపించారు. శవపేటికను..
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. కేసీఆర్, చంద్రబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేశ్, రామ్ చరణ్ తదితరులు నివాళి అర్పించి.. మహేశ్ ను పరామర్శించారు. మరోవైపు కృష్ణ భౌతికకాయాన్ని చూసి మోహన్ బాబు చలించిపోయారు. భోరున విలపించారు. శవపేటికను పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు కృష్ణనే తనను పైకి తీసుకొచ్చారని తెలిపారు. కృష్ణతో కలిసి 70కి పైగా సినిమాల్లో నటించానని.. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశానని పేర్కొన్నారు. కృష్ణగారు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story