Mon Dec 23 2024 11:10:04 GMT+0000 (Coordinated Universal Time)
మనోజ్ - మౌనిక ల పెళ్లి గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడను : మోహన్ బాబు
మనోజ్ నా దగ్గరికి వచ్చి, డాడీ.. ఇదీ పరిస్థితి.. పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు. ఆలోచించారా అన్నాను. లేదు డాడీ నేను..
ఇటీవల కాలంలో మోహన్ బాబు సినిమాలను చాలా తగ్గించేశారు. తన పరిధికి తగిన పాత్రలను ఎంచుకుంటూ.. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. పేరుకి ఆయన ఓ పార్టీ వైపు ఉన్నా.. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. మంచు మనోజ్ - మౌనిక ల పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఆది నుంచి ఆయనకు వారిద్దరి వివాహం ఇష్టంలేదన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అలాంటి ప్రశ్నే ఆయనకు ఎదురైంది.
అందుకు మోహన్ బాబు.. "మనోజ్ నా దగ్గరికి వచ్చి, డాడీ.. ఇదీ పరిస్థితి.. పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు. ఆలోచించారా అన్నాను. లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నాడు. అయితే అలాగే కానీ.. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. కాదని ఎందుకు అంటాను? ఈ విషయంలో ఎవరో ఏదో రాశారనీ .. ఏదో అనుకుంటున్నారని ఆలోచించడం నాకు అలవాటు లేదు. వాడేం అనుకుంటున్నాడో .. వీడేం అనుకుంటున్నాడో అని పట్టించుకుంటూ కూర్చుంటే నన్ను నేను మరిచిపోతాను. ఏనుగు వెళుతుంటే కుక్కలెన్నో మొరుగుతూ ఉంటాయి .. మొరగనీ. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు .. సుఖంగా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమించుకున్నారు? వంటి విషయాల్లోకి డీప్ గా వెళ్లొద్దు. నేను హ్యాపీగా ఉన్నాను కనుకనే పెళ్లికి వెళ్లాను" అని బదులిచ్చారు.
Next Story