Mon Dec 23 2024 10:08:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. లింక్ ఇదిగో
వరుస ఫ్లాప్ ల తర్వాత మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్
వరుస ఫ్లాప్ ల తర్వాత మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇటీవల 'నేరు' సినిమాతో హిట్ ను అందుకున్నాడు. బ్లాక్‌బస్టర్ నేరు ఇప్పుడు OTTలో అందుబాటులో ఉంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగుందని ఇప్పటికే ప్రశంసలు దక్కాయి. ప్రేక్షకులు ఈ కోర్ట్‌రూమ్ డ్రామాని మెచ్చుకున్నారు. సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ నేరు ఇప్పుడు OTTలో రిలీజ్ అయింది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు, మీరు చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో చూడవచ్చు. థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వారు ఓటీటీలో హాయిగా చూడవచ్చు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ప్రపంచవ్యాప్తంగా 86కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం మోహన్‌లాల్ కెరీర్ లో 3వ అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది. మలయాళ సినిమాల్లో ఆల్ టైమ్ 5వ అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది. ఎన్నో పరాజయాల తర్వాత మోహన్లాల్కి ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో 5 భాషల్లో ప్రసారం అవుతోంది. జీతూ జోసెఫ్ తో కలిసి ఇంతకు ముందు మోహన్ లాల్ దృశ్యం సినిమా తీసిన సంగతి తెలిసిందే!
Next Story