Mon Dec 23 2024 11:25:40 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఫేవరెట్ సింగర్స్ ఎవరో తెలుసా ?
ఇంటర్వ్యూలో ఇద్దరు హీరోలను కీరవాణి పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. వాటిలో భాగంగా.. సీనియర్ సింగర్స్ కాకుండా.. ప్రస్తుతం ఉన్న
హైదరాబాద్ : ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ -రామ్ చరణ్ లు హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అనేక వాయిదాల పర్వం అనంతరం ఈనెల 25న విడుదలవుతోంది. సినిమా విడుదలకు ఇక మూడ్రోజులే సమయం ఉంది. దాంతో ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాకు, తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటున్నారు తారక్, చరణ్ లు. తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా.. తారక్, చరణ్ లను సంగీత దర్శకుడు కీరవాణి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.
ఇంటర్వ్యూలో ఇద్దరు హీరోలను కీరవాణి పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. వాటిలో భాగంగా.. సీనియర్ సింగర్స్ కాకుండా.. ప్రస్తుతం ఉన్న యంగ్ సింగర్స్ లో మీకు బాగా నచ్చిన, మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు అని అడిగారు కీరవాణి. బదులుగా తారక్ మాట్లాడుతూ.. అరవింద సమేత సినిమాలో "రెడ్డమ్మతల్లి" పాట పాడిన మోహన భోగరాజు గారు, అఖండ సినిమాలో "జై బాలయ్య" పాడిన గీతామాధురి వాయిస్ లు, వారి పాటలు బాగుంటాయని, వాళ్లిద్దరూ తనకు ఇష్టమైన సింగర్స్ అని తెలిపారు.
చరణ్ మాట్లాడుతూ.. "బుల్లెట్ బండి" పాట పాడిన మోహన భోగరాజు గారు, లవ్ స్టోరీలో "సారంగదరియా" పాటను ఆలపించిన మంగ్లీ గారి వాయిస్ లు బాగుంటాయని, వాళ్లిద్దరూ తన ఫేవరెట్ సింగర్స్ అని తెలిపారు. దాంతో మోహన్ భోగరాజు, గీతా మాధురి, మంగ్లీలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాట్లాడిన మాటలను తమ సోషల్ మీడియాల్లో షేర్ చేసి, థ్యాంక్స్ చెప్పారు.
News Summary - Mohana bhogaraju, geetha madhuri, mangli are the favourite singers for NTR And Charan
Next Story