Mon Dec 23 2024 17:57:00 GMT+0000 (Coordinated Universal Time)
మొన్న ప్రభాస్.. నేడు మోహన్ లాల్.. మంచు విష్ణు కన్నప్ప..
మంచు విష్ణు 'కన్నప్ప' ప్రాజెక్ట్ లోకి ఒకరి తరువాత ఒకరిగా ఇండియన్ టాప్ స్టార్స్ అంతా ఎంట్రీ ఇస్తున్నారు. మొన్న ప్రభాస్, నేడు..
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ని పట్టాలు ఎక్కించాడు. తనికెళ్ళ భరణి అందించిన కథకి రైటర్స్ విజయేంద్ర ప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్, తోటపల్లి సాయినాథ్, దర్శకులు ఈశ్వర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి మెరుగులు దిద్దారు. ఈ మూవీ షూటింగ్ ని మొత్తం న్యూజిలాండ్ లోనే జరపబోతున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఇంటరెస్టింగ్ న్యూస్లు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.
ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. వాటిని ఇటీవల సీనియర్ హీరోయిన్ 'మధుబాల' కన్ఫార్మ్ చేశారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మధుబాల మాట్లాడుతూ.. ఈ మూవీలో తనతో పాటు ప్రభాస్, నయనతార కూడా నటించబోతున్నారని తెలియజేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరిగింది. ప్రభాస్ అండ్ నయన్.. శివపార్వతి రోల్స్ లో కనిపించబోతున్నారని సమాచారం.
కాగా ఈ మూవీలో మరికొందరు స్టార్స్ కూడా నటించబోతున్నారని విష్ణు ఆల్రెడీ తెలియజేశాడు. ఈక్రమంలోనే తాజాగా ఇప్పుడు మరో స్టార్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మలయాళ అగ్ర హీరో మోహన్లాల్ (Mohanlal) ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేయబోతున్నాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పిఆర్.. విష్ణు, మోహన్ లాల్ ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ఇక ఈ పోస్టుని మంచు విష్ణు రీ షేర్ చేస్తూ.. హరహర మహాదేవ్ అంటూ కన్ఫార్మ్ చేశాడు.
ఇక ఒకరి తరువాత ఒకరిగా ఇండియన్ టాప్ స్టార్స్ అంతా ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తుండడంతో ఈ మూవీకి పాన్ ఇండియన్ అటెన్షన్ వస్తుంది. కాగా ఈ మూవీని బాలీవుడ్ దర్శకుడు 'ముఖేష్ కుమార్ సింగ్' డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ టెలివిజన్లో సూపర్ హిట్ సిరీస్గా నిలిచిన 'మహాభారత'ని డైరెక్ట్ చేసింది ఈ దర్శకుడే. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ 'నుపుర్ సనన్'ని తీసుకున్నారు. అయితే నుపుర్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు.
Next Story