Mon Dec 23 2024 03:51:32 GMT+0000 (Coordinated Universal Time)
భగవంత్ కేసరి సెట్స్ లో శ్రీలీలతో మోక్షజ్ఞ ముచ్చట్లు..
'భగవంత్ కేసరి' సెట్స్ లోకి తాజాగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చాడు. మోక్షజ్ఞ కేవలం షూటింగ్ చూడడానికే వచ్చాడా..? లేదా సినిమాలో ఏమన్నా గెస్ట్ రోల్ చేయబోతున్నాడా..?
బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్ గా నటిస్తోండగా శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో కనిపించబోతుంది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా చేస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఈక్రమంలోనే హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ లో ప్రధాన తారాగణం పై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సెట్స్ లోకి తాజాగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ (Mokshagna Teja) ఎంట్రీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిలో మోక్షజ్ఞ కళ్ళజోడు, బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే సెట్స్ లో హీరోయిన్ శ్రీలీలతో కలిసి ముచ్చట్లు పెడుతూ కనిపిస్తున్నాడు.
అయితే మోక్షజ్ఞ కేవలం షూటింగ్ చూడడానికే వచ్చాడా..? లేదా సినిమాలో ఏమన్నా గెస్ట్ రోల్ చేయబోతున్నాడా..? అని కొంతమంది అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. హీరోయిన్ గా శ్రీలీల ఉంటే బాగుంటుంది అని సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ పై అప్డేట్.. ఈ ఏడాది అయినా వస్తుందా అనేది చూడాలి.
ఇక భగవంత్ కేసరి విషయానికి వస్తే.. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య గత రెండు సినిమాలు వీరసింహారెడ్డి, అఖండ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ మూవీ బాలయ్యకి హ్యాట్రిక్ ని అందిస్తుందా? లేదా? చూడాలి. అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Next Story